పవ‌న్ పాట‌కి స్టెప్పులేసిన నిహారిక, సుహాసిని

Sun,March 10, 2019 07:40 AM
niharika dance with suhasini for kushi movie song

మెగా హీరోయిన్ నిహారిక త‌న బాబాయి సూప‌ర్ హిట్ చిత్రం ఖుషీలోని ‘అమ్మాయే సన్నగా..’ పాటకు స్టెప్పులేసింది. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమంటే ఆమె ఒక్క‌తే వేయ‌డం కాదు అల‌నాటి అందాల న‌టి సుహాసినితో కూడా డ్యాన్స్ చేయించింది. సూర్య‌కాంతం సెట్ లో వీరిద్ద‌రు స‌ర‌దాగా డ్యాన్స్ చేయ‌గా ఆ వీడియోని చిత్ర ప్ర‌మోష‌న్‌కి వాడుకుంది చిత్ర బృందం. సుహాసినికి డ్యాన్స్‌లో సూచ‌న‌లిస్తూ నిహారిక చేసిన డ్యాన్స్ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. సూర్య కాంతం చిత్రం మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో స్పీడ్ పెంచారు మేక‌ర్స్‌. వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిహారిక‌, రాహుల్ విజ‌య్, ప‌ర్లీన్ బ‌సానియా ప్ర‌ధాన పాత్ర‌లుగా సూర్య‌కాంతం చిత్రం తెర‌కెక్కింది. నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు . మార్క్‌ కె రాబిన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే భావ‌న‌లో చిత్ర యూనిట్ ఉంది.



3510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles