త్వ‌ర‌లో జ‌య‌సుధ త‌న‌యుడి పెళ్ళి..!

Thu,September 12, 2019 08:39 AM
Nihar Kapoor tie the knot soon

సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ పెద్ద కుమారుడు నిహార్ క‌పూర్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరి 26న వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్‌ని నిహార్ వివాహం చేసుకోనున్న‌ట్టు స‌మాచారం. అమ్రిత్ మార్కెటింట్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌ని చేస్తుంద‌ట‌.

జ‌య‌సుధ‌, నితిన్ క‌పూర్‌ల‌కి 1985లో వివాహం జరిగింది. ఈ దంపతులకు నిహార్, శ్రేయాన్ ఇద్దరు కుమారులున్నారు. నితిన్ కపూర్ హిందీలో మేరా పతి సిర్ఫ్ మేరా హై, తెలుగులో కలికాలం, హ్యాండ్సాఫ్ సినిమాలను నిర్మించారు. జయసుధ తన రెండో కుమారుడు శ్రేయాన్‌ని బస్తీ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక నితిన్ కపూర్ బాలీవుడ్ నటుడు జితేంద్రకు సోదరుడు. కొద్ది రోజుల క్రితం నితిన్ క‌పూర్ ముంబైలోని తన కార్యాలయం భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే

3798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles