ప్రియుడితో ముంబైకి చేరుకున్న ప్రియాంక చోప్రా

Fri,June 22, 2018 01:21 PM
Nick Jonas In The Car With Priyanka Chopra

గ్లోబ‌ల్ భామ ప్రియాంకా చోప్రా కొన్నాళ్ళుగా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో చెట్టాప‌ట్టాలు వేస్తున్న విష‌యం తెలిసిందే . ఎక్కడికెళ్లినా ఇద్దరూ క‌లిసే వెళుతున్నారు . ఆ మ‌ధ్య ఓ బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వెళ్ళిన వారు వెంటనే లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్ హాలీవుడ్‌లో ఉన్న టోకా మెడెరాలో డిన్నర్ డేట్‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి కెమెరా కంట ప‌డ్డారు . ఇక ఆ త‌ర్వాత‌ నిక్‌ జోనాస్‌ బంధువు పెళ్లికి వెళ్లింది ప్రియాంక . వేడుక‌లో ఇరువురు చేతులు జోడించి న‌డ‌వ‌గా, పెళ్లిలో నిక్‌ కుటుంబ సభ్యులతో ప్రియాంక చనువుగా ఉండ‌డం చూసి అంద‌రు షాక్ అయ్యార‌ట‌. త్వర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డం ఖాయం అని అన్నారు.

ప్రియాంక కొద్ది సేప‌టి క్రితం త‌న ప్రియుడు నిక్ జోనాస్‌తో క‌లిసి సీక్రెట్‌గా ముంబై చేర్చుకుంది. తెల్ల‌వారుజామున ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న వీరిద్ద‌రు ఎవ‌రికంటా క‌న‌ప‌డ‌కుండా ఎయిర్‌పోర్ట్ నుండి బ‌య‌ట‌కి వ‌చ్చి కారు ఎక్కారు. అయితే కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఫోటోగ్రాఫర్స్ వీరిద్దరిని త‌మ కెమెరాలో బంధించారు. ఆ స‌మ‌యంలో నిక్ న‌ల్లని వ‌స్త్రంతో త‌న మొహాన్ని క‌వ‌ర్ చేసుకున్నారు. జుహూలోని ఇంటికి చేరుకున్న నిక్ జోనాస్‌కి ప్రియాంక కుటుంబం స్పెష‌ల్ పార్టీ ఇవ్వ‌నుంద‌ట‌. ప్రియాంక త‌ల్లిని క‌లిసేందుకే నిక్ జోనాస్ ముంబై వ‌చ్చాడ‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే రానున్న రోజుల‌లో నిక్ జొనాస్‌, ప్రియాంక చోప్రాలు కలిసి ఓ సినిమా ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు కూడా వెల్ల‌డించ‌నున్నార‌ట‌. హాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక త్వ‌ర‌లో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేయ‌నుంది.

2691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles