క‌ళాకారులం .. మేం క‌ళాకారులం అన్న హౌజ్‌మేట్స్

Sat,July 27, 2019 08:29 AM
nice skit performed in bigg boss house

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 జూన్ 21న ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఐదు రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌ని హీటెక్కించిన 15 మంది స‌భ్యులలో ఒక‌రు నేడు ఎలిమినేట్ కానున్నారు. దీంతో ఈ రోజు కార్య‌క్ర‌మం చాలా ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఇక కింగ్ నాగార్జున ఇన్ని రోజులు హౌజ్‌లో జ‌రిగిన ప‌రిణామాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అయితే ఎలిమినేషన్‌లో ఆరుగురు స‌భ్యులు .. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండ‌గా, వారి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిగా మారింది.

ఐదో రోజు బిగ్ బాస్ హౌజ్‌లో వితికా విష‌యంలో వరుణ్ తేజ్- మహేష్ విట్టాల మధ్య రణరంగమే జరిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజా ఎపిసోడ్‌లో చ‌ర్చించారు. లివింగ్ రూమ్‌లో అంద‌రి ఇంటి స‌భ్యుల మ‌ధ్య మ‌హేష్ విట్టా ఈ వివాదం గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే త‌ను చెప్పే విధానం వేరే వాళ్ళ‌కి క‌టువుగా అనిపిస్తుంద‌ని, అందుకే త‌న మ‌న‌సులోని మాట‌ల‌ని బాబా బాస్క‌ర్ చెబుతార‌ని అనే స‌రికి కోపోద్రిక్తుడైన వ‌రుణ్ సందేశ్ లివింగ్ ఏరియా నుండి గార్డెన్ ఏరియాలోకి వెళ్ళాడు. ఆ త‌రువాత ఇంటి స‌భ్యులు వ‌రుణ్‌ని లోప‌ల‌కి తీసుకొచ్చి ఇద్ద‌రికి స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసిన గొడ‌వ చ‌ల్లార‌లేదు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మ‌హేష్ విట్టా స్వ‌యంగా వ‌చ్చి వ‌రుణ్ సందేశ్‌కి సారీ చెప్పి ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాడు.

ఇక శుక్ర‌వారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ఓ టాస్క్ ఇచ్చాడు. క‌ళాకారులం మేం క‌ళాకారులం అనే స్కిట్ ఇచ్చారు. ఇందు కోసం ఇంటి స‌భ్యుల‌ని బిగ్ బాస్ రెండు టీంలుగా విభ‌జించారు. ఒక స్కూల్ పేరు శ్రీముఖి స్కూల్ కాగా అందులో వరుణ్, వితిక, రవిక్రిష్ణ, రోహిణి, హేమ, పునర్నవి, అషు సభ్యులుగా ఉంటారు. ఇక రెండో టీంగా భాస్క‌ర్ స్కూల్ కాగా, ఇందులో అలీ రాజా, మహేష్ విట్టా, రాహుల్, బాబా భాస్కర్, జాఫర్, సావిత్రి, హిమజలు సభ్యులుగా ఉన్నారు. ముందుగా టాస్క్‌కి సంబంధించి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన ఇంటి స‌భ్యులు కొద్ది సేప‌టి త‌ర్వాత రంగంలోకి దిగారు.

ముందుగా శ్రీముఖి టీం చిన్న‌పాటి హార‌ర్ సినిమాని చూపించింది. రోహిణి, ర‌వికృష్ణ‌లు అబ్బ‌నీ తీయ‌ని దెబ్బ అనే పాట‌కి స్టెప్పులు వేసి అల‌రించ‌గా మిగ‌తా వారు త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టున్నారు. చివ‌రిగా శ్రీముఖి, హేమ‌లు ఫ‌స‌క్ అంటూ స్కిట్‌కి ఎండ్ కార్డ్ వేశారు. ఇక భాస్కర్ స్కూల్ టీం సామాజిక నేప‌థ్యంతో రైతు, ప‌ల్లెటూరి నేప‌థ్యంలో స్కిట్ చేశారు. రంగస్థలం టైటిల్ సాంగ్ పాడుతూ రైతుని, పంచపొలాలను చులకన చేసే వాళ్ల దుమ్ముదులిపేశాడు మ‌హేష్ విట్టా. రైతుగా మ‌హేష్ న‌ట‌న అదిరిపోయింది. మిగ‌తా స‌భ్యులు కూడా త‌మ పాత్ర మేర‌కి ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చారు. మొత్తానికి గ‌త మూడు రోజుల నుండి ప్రేక్ష‌కుల‌కి మెంటలెక్కించిన‌ హౌజ్‌మేట్స్ నిన్న‌టి ఎపిసోడ్‌లో చ‌క్క‌టి స్కిట్‌తో అల‌రించారు. మ‌రి ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవ‌రు వెళ‌తారు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, మ‌రి కొద్ది గంట‌ల‌లో దీనిపై క్లారిటీ రానుంది.

1617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles