త‌మ‌న్నా, సందీప్‌ల నెక్ట్స్ ఏంటి టీజ‌ర్

Thu,November 15, 2018 08:15 AM
Next Enti Official Teaser released

యువ హీరో సందీప్ కిష‌న్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, క్రేజీ హీరో న‌వదీప్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం నెక్ట్స్ ఏంటి. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ కునాల్ కోహ్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిందీలో ‘ఫనా’, ‘హమ్ తుమ్’ లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన కునాల్ ఈ మూవీతో తెలుగులోకి డెబ్యూ ఇస్తున్నాడు. రైనా జోషి, అక్షయ్ పూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో త‌మ‌న్నా ఫ్రెష్‌లుక్‌లో క‌నిపించ‌గా, సందీప్ కిష‌న్ ప్లే బాయ్‌గా అద‌ర‌గొట్టాడు. యూత్‌కి న‌చ్చే అన్ని అంశాల‌తో ఈ చిత్రాన్ని రూపొందించార‌ని టీజ‌ర్‌ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. గోపు కిషోర్ రెడ్డి డైలాగ్స్, లియోన్ జేమ్స్ మ్యూజిక్, మనీష్ చంద్ర సినిమాటోగ్రఫీ బాగున్నాయి. టీజర్‌తో మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ చేసిన ‘నెక్స్ట్ ఏంటి?’ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS