న్యూటన్ ఔట్

Fri,December 15, 2017 12:52 PM
న్యూటన్ ఔట్

హైదరాబాద్: ఆస్కార్స్ రేసు నుంచి న్యూటన్ ఔటైంది. రాజ్‌కుమార్ రావు నటించిన న్యూటన్ చిత్రం విదేశీ క్యాటగిరీలో ఆస్కార్స్‌కు ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా మోషన్ పిక్చర్ అకాడమీ తుది దశ జాబితాను రిలీజ్ చేసింది. ఆ లిస్టులో మొత్తం తొమ్మిది విదేశీ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. అందులో న్యూటన్‌కు చోటు దక్కలేదు. న్యూటన్ చిత్రాన్ని అమిత్ మసూర్‌కర్ డైరక్ట్ చేశారు. విదేశీ చిత్రాల క్యాటగిరీలో మొత్త0 92 చిత్రాలు పోటీ పడ్డాయి. అయితే ఫైనల్ జాబితాకు న్యూటన్ ఎంపిక కాలేదు. ఫైనల్ లిస్టులో చోటు దక్కించుకున్న చిత్రాల్లో ఏ ఫంటాస్టిక్ వుమెన్(చిలీ), ఇన్ ద ఫేడ్(జర్మనీ), ఆన్ బాడీ అండ్ సోల్(హంగేరి), ఫాక్స్‌ట్రాట్(ఇజ్రాయిల్), ద ఇన్‌సల్ట్(లెబనాన్), లవ్‌లెస్(రష్యా), ఫెలిసైట్(సెనిగల్), ద వూండ్(సౌతాఫ్రికా), ద స్కేర్(స్వీడన్) ఉన్నాయి. జనవరి 23వ తేదీన 90వ అకాడమీ అవార్డ్స్‌కు నామినేషన్లను ప్రకటిస్తారు. ఆస్కార్స్ వేడుక మార్చి 4వ తేదీన జరుగుతుంది.

1328
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS