ర‌ణ్‌వీర్ ‘సింబా’ స్పెష‌ల్ టీజ‌ర్ అదుర్స్

Wed,August 15, 2018 06:57 PM
new video of ranveer singh from simbha is going viral

ముంబ‌యి: పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వ‌చ్చిన చిత్రం టెంపర్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ‘సింబా’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన‌పాత్ర‌ పోషిస్తుండగా.. సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్‌(కరణ్‌జోహార్), రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని స్పెష‌ల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. షూటింగ్‌లో భాగంగా తీసిన కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను వీడియోలో చూపించారు. ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ‘సంగ్రామ్‌ భాలేరావ్’ ప‌వ‌ర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ప్రపంచ‌వ్యాప్తంగా డిసెంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


3117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles