ప‌ద్మావ‌త్ న్యూ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

Tue,January 16, 2018 11:19 AM
New Trailer Of Sanjay Leela Bhansali Padmaavat

అనేక వివాదాల మ‌ధ్య న‌లుగుతూ వ‌చ్చిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ద్మావ‌త్ ఎట్ట‌కేల‌కు జ‌న‌వరి 25న విడుద‌లయ్యేందుకు సిద్ధ‌మైంది. చ‌రిత్ర‌ని వక్రీక‌రించార‌న్న కారణంగా క‌ర్ణిసేన‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో సెన్సార్ స‌భ్యులు చిత్ర యూనిట్‌కి కొన్ని సూచ‌న‌లు చేశారు. ప‌ద్మావ‌తి మూవీని ప‌ద్మావ‌త్‌గా మార్చ‌డంతో పాటు చిత్రంలో కొన్ని స‌న్నివేశాల‌ని తొల‌గించాల‌ని సూచించారు. దీనికి చిత్ర బృందం కూడా ఒప్పుకోవ‌డంతో సెన్సార్ బోర్డ్‌ యూ/ఏ సరిఫ్టికెట్ ఇస్తూ మూవీ రిలీజ్‌కి మార్గం సుగ‌మం చేసింది. ఈ సినిమాలో దాదాపు 26 దృశ్యాలను కత్తిరిస్తున్నారన్న వార్తలు రాగా, అందులో నిజం లేదంటూ సీబీఎఫ్‌సీ చైర్మన్ ప్రసూన్‌జోషి ఇటీవలే ప్రకటన విడుదల చేశారు. సినిమా టైటిల్‌తో సహా మొత్తం అయిదు మార్పులు సూచించినట్టు స్పష్టంచేశారు. సినిమా ప్రారంభంలో డిస్‌క్లైమ‌ర్‌ ప్రదర్శించటం, సతి ఆచారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని, గూమర్ పాటను మార్చాలని సూచించినట్టు ఆయ‌న‌ తెలిపారు. ఇందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించడం వ‌ల‌నే సినిమా విడుద‌ల అవుతుందని ఆయ‌న అన్నారు. ఇక తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో రాణి ప‌ద్మిని, ఆమె భ‌ర్త‌ రావ‌ల్ ర‌త్ సింగ్ (షాహిద్ క‌పూర్‌), అల్లావుద్దీన్ ఖిల్జీ(ర‌ణ్‌వీర్ సింగ్‌)ల‌కి మ‌ధ్య కొన్ని స‌న్నివేశాల‌ని చూపించారు. ఇవి సినిమాపై ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఎపిక్ డ్రామాగా రూపొందిన చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS