'ప్ర‌తి రోజు పండ‌గే' అంటున్న మెగా హీరో

Tue,June 11, 2019 12:05 PM

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, క్రేజీ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై ఇప్ప‌టికీ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌, ప్రాజెక్టుకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చిత్రంలో క‌థానాయిక‌గా అవికా గోర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ఇటీవ‌ల ఓ వార్త వ‌చ్చింది. దీనిపై క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రలహరి విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతున్నాడు.అయితే ఈ చిత్రానికి భోగి అనే టైటిల్‌ని ఫిక్స్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని ఈ టైటిల్‌కి నెగ‌టివ్ ఫీడ్ బ్యాక్ రావ‌డంతో ప్ర‌తి రోజు పండ‌గే అనే టైటిల్‌ని పెట్టాల‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ చిత్రంలో తేజూ డిఫ‌రెంట్ లుక్‌లో కనిపించ‌నున్నాడ‌ట‌.

2141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles