చైతూ- స‌మంత మూవీ టైటిల్ ఏంటో తెలుసా ?

Thu,August 16, 2018 12:06 PM
new title for chaitu, sam movie

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ ఎవ‌రంటే ముందుగా అంద‌రికి గుర్తుకి వ‌చ్చేది స‌మంత‌, నాగ చైత‌న్య జంట‌. గ‌త ఏడాది వివాహం చేసుకున్న ఈ జంట వ‌ర్క్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్ళి త‌ర్వాత ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న వీరిద్ధ‌రు త్వ‌ర‌లో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో క‌లిసి ఓ మూవీ చేయ‌నున్నారు. ఇందులో స‌మంత‌, నాగ చైత‌న్య‌లు భార్యాభ‌ర్త‌లుగా క‌నిపించ‌నుండ‌గా, వారి మ‌ధ్య‌లోకి ఓ యువ‌తి రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డుతుంద‌ట‌. కాని ఇరువురి మ‌న‌సుల‌లో ఉన్న అమిత‌మైన ప్రేమ కార‌ణంగా ఇద్ద‌రు తిరిగి క‌లుస్తార‌నేది సినిమా క‌థ అని స‌మాచారం. భార్యాభర్తల మధ్య ప్రేమ విలువను తెలిపే కథతో ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ మూవీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంద‌ని అంటున్నారు. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల‌లో చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. చిత్రానికి ప్రేయ‌సి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీకి మ‌జిలి అనే టైటిల్ అయితే బాగుంటుంద‌ని టీం భావిస్తుంద‌ట‌. ఇందులో నాగచైతన్య క్రికెటర్‌ పాత్రను పోషించనున్నారని టాక్‌.

3752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles