సైనికులకి సెల్యూట్ అంటున్న అల్లు అర్జున్‌

Fri,January 19, 2018 12:13 PM
new song comes from bunny movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌క్కంతం వంశీ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఏప్రిల్‌లో ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుండ‌గా, మ‌రో వైపు ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా చేప‌డుతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ఇంపాక్ట్ తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.ఇక రిపబ్లిక్‌డే‌ని పురస్కరించుకుని ఈ సినిమాలోని ‘సైనిక’ అనే సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నారు. మన సైనికులకు అంకితమిస్తూ జనవరి 26న ‘సైనిక’ అనే సాంగ్‌ని విడుదల చేయబోతున్నట్లుగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ పేజీలో ఒక పోస్టర్‌ని విడుదల చేశారు. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బన్నీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అభిమానులని ఎంత‌గానో అల‌రిస్తాయ‌ని అంటున్నారు. లగడపాటి శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. దేశభక్తి నైపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.


1848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles