చెహ‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. ఏప్రిల్‌లో విడుద‌ల‌కి స‌న్నాహాలు

Sat,November 9, 2019 08:22 AM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబాబ్ బ‌చ్చ‌న్ ఏడు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. చివ‌రిగా బ‌ద్లా చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఆయ‌న ప్ర‌స్తుతం బాలీవుడ్ కిస్సింగ్ వీరుడు ఇమ్మాన్ హ‌ష్మీతో క‌లిసి మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ చెహ‌ర్ అనే సినిమా చేస్తున్నారు. కృతి క‌ర్బంధ‌, రియా చ‌క్ర‌వ‌ర్తి, సిద్ధాంత్ క‌పూర్, ర‌ఘుబీర్ యాద‌వ్, దృత్‌మాన్ చ‌క్ర‌వ‌ర్తి, అన్ను క‌పూర్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. రుమి జ‌ఫ్రీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆనంద్ పండింట్ మోష‌న్ పిక్చ‌ర్స్‌, స‌ర‌స్వ‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 21, 2020న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అప్ప‌ట్లో మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని తాజాగా రిలీజ్ డేట్ మారుస్తూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 24,2020న చెహ‌ర్ చిత్రం విడుద‌ల కానుంద‌ని వారు తెలియ‌జేశారు. ఇమ్రాన్, అమితాబ్ ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంది.

455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles