క‌రీనా త‌న‌యుడి పేరుతో రూపొందనున్న చిత్రం..!

Sun,December 16, 2018 07:28 AM
new movie comes on name of taimur

క‌రీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ పుట్టినప్పటి నుంచీ తరచూ వార్తల్లో వినిపిస్తూ ఉన్న సంగ‌తి తెలిసిందే. తన పేరుపై వివాదం దగ్గర నుంచి అతడు బయటకు వచ్చిన ప్ర‌తీసారి హాట్ టాపిక్ గా మారుతున్నాడు. సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్న తైమూర్‌ని చూసుకోవ‌డం కోసం రూ.1.75 లక్షలు ఇచ్చి మ‌రీ ఓ మ‌హిళ‌ని ఉద్యోగంలో పెట్టుకున్నార‌ట ఈ సెల‌బ్రిటీ క‌పుల్‌. తైమూర్‌కి ముంబైలోనే కాదు ఇత‌ర ప్రాంతాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల‌ కేరళలోని ఓ బొమ్మల దుకాణంలో తైమూర్‌ బొమ్మలు దర్శనిమవ్వ‌డం అంద‌రికి షాకింగ్‌గా మారింది. ఓ నెటిజ‌న్ షాపులోని తైమూర్ బొమ్మ‌ను ఫోటో తీసి ఇంట‌ర్నెట్‌లో షేర్ చేయ‌డంతో ఇది వైర‌ల్‌గా మారింది. ఇంత చిన్న వ‌య‌స్సులో అంత ఫాలోయింగ్ తైమూర్‌కి రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఖంగు తిన్నారు.

ఇక ఆ త‌ర్వాత తైమూర్ బ్యాగ్ హాట్ టాపిక్‌గా మారింది. తైమూర్ స్కూల్ బ్యాగ్ పైన టెడ్డీ సింబ‌ల్‌తో పాటు ఈ బుడ‌త‌డి పేరు రాసి ఉండ‌డం నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు తైమూర్ పేరుతో సినిమా రానుంద‌నే వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ‘ఫ్యాషన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించిన మధుర్‌ భండార్కర్ తైమూర్ పేరుని ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ చేయ‌గా, ఆ పేరుతో తీయ‌బోవు సినిమాని ప‌టౌడీ కుటుంబంలోని నేటి త‌రం న‌టుల‌తో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాంటే కొన్నాళ్ళు ఆగ‌క త‌ప్ప‌దు.

1965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles