చింతించిన బిగ్ బాస్ .. హిస్ట‌రీలో ఇదే తొలిసారి

Sat,September 1, 2018 08:51 AM
new history creates bigg boss2

బిగ్ బాస్ సీజ‌న్ 2 శుక్ర‌వారంతో 83 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇంకా కేవ‌లం 17 ఎపిసోడ్స్ మాత్ర‌మే మిగిలి ఉండ‌గా, ఇప్ప‌టి నుండే టైటిల్ విన్న‌ర్ ఎవ‌ర‌నే దానిపై హోరా హోరీగా చర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇక‌ ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా ఉండేందుకు అలిసిపోతే అంత‌మే అనే సైకిల్ టాస్క్ ఇవ్వ‌గా ఇందులో త‌నీష్‌, నూత‌న్ నాయుడు, రోల్ రైడాలు పాల్గొన్నారు. ఎవ‌రైతే అల‌సిపోకుండా చివ‌రి వ‌ర‌కు సైకిల్ తొక్కుతూనే ఉంటారో వారే ఈ టాస్క్ విజేత అని బిగ్ బాస్ ప్ర‌క‌టించ‌డంతో ముగ్గురు పోటాపోటీగా గేమ్‌లో పాల్గొన్నారు.

సైకిల్ తొక్కుతున్న క్ర‌మంలో నూత‌న్ నాయుడు సైకిల్ చైన్‌ స్ట్ర‌క్ కావ‌డంతో హౌజ్‌లో వివాదం రేగింది. చైన్ స‌రిచేయ‌బోతున్న‌ కౌశ‌ల్‌ని దీప్తి అడ్డుకుంది. అంతలోనే బిగ్ బాస్ చైన్ స‌రిచేయోచ్చ‌ని చెప్ప‌డంతో కౌశ‌ల్ సైకిల్ చైన్ స‌రిచేశారు. కాని సైకిల్ చైన్ ప‌దే ప‌దే స్ట్ర‌క్ అవ్వ‌డంతో నూత‌న్ నాయుడు రిలాక్స్ అవుతూ క‌నిపించాడు. ఇది న‌చ్చ‌ని త‌నీష్ సైకిల్ దిగి గేమ్ నుండి క్విట్ అయ్యాడు. కాలు స‌రిగా లేక‌పోయిన గేమ్ ఆడాను. బాలేని సైకిల్ ఇచ్చి గేమ్ ఆడించ‌డం ఏం బాగోలేదు . నూతన్ నాయుడ్ని కెప్టెన్ చేసేందుకు బిగ్ బాస్ డ్రామాలు ఆడుతున్నారని.. డైరెక్ట్‌గా అతన్ని కెప్టెన్ చేస్తే సరిపోతుంది కదా మా ఎనర్జీతో ఆడుకోవడం ఎందుకు అంటూ ఎమోషన్ అవుతూ సామ్రాట్ వద్ద బాధపడ్డాడు త‌నీష్‌.

త‌నీష్ డ్రాప్ కావ‌డంతో కెప్టెన్ టాస్క్‌లో రోల్ రైడా, నూత‌న్ నాయుడు మిగ‌ల‌గా, వారి వారి మ‌ద్ద‌తు దారులు తాము మద్దతు ఇచ్చే వారే కెప్టెన్ కావాలాని కోరారు. ఈ క్ర‌మంలో కౌశల్ .. నూతన్ నాయుడ్ని ఈసారి కెప్టెన్ చేద్దాం. గ‌త వారం నువ్వు కెప్టెన్‌గానే ఉన్నావు క‌దా. మీరు గేమ్ ఆపేయండ‌ని రోల్‌ని కోరాడు.కాని రోల్ ఒప్పకోలేదు. తాను కెప్టెన్ అవుతా అంటూ మొండిప‌ట్టుకు కూర్చున్నాడు. టాస్క్ ఎండ్ బ‌జ‌ర్ మోగే సరికి నూత‌న్, రోల్‌లు ఇద్ద‌రు సైకిల్‌పై ఉండ‌డంతో ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌కి ఎవ‌రు కెప్టెన్‌గా ఉండ‌రు. ఈ నిర్ణ‌యం తెలియ‌జేయ‌డానికి చింతిస్తున్నామ‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఇలా ఓ వారం బిగ్ బాస్ హౌజ్‌కి కెప్టెన్ లేక‌పోవ‌డం హిస్ట‌రీలోనే తొలిసారి.

ఇక బిగ్ బాస్ ఇచ్చిన మ‌రో టాస్క్‌లో ముగ్గురు మ‌హిళ‌లు ఇంట్లో ఉన్న ఇద్ద‌రు పురుషుల‌ని ఎంపిక చేసుకొని , వారి సాయంతో స్టైలిష్‌గా త‌యార‌వ్వాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో సంచాల‌కుడిగా కౌశ‌ల్ ఉన్నారు. దీప్తి,నూత‌న్‌, గ‌ణేష్ ఒక‌టీం శ్యామ‌ల‌, త‌నీష్‌, రోల్ రైడా మ‌రోక టీం గీతా, అమిత్‌, సామ్రాట్ వేరొక టీంగా ఉన్నారు. ఈ టాస్క్‌లో అందంగా రెడీ అయిన శ్యామ‌ల‌ని విన్న‌ర్‌గా ప్ర‌క‌టించిన కౌశ‌ల్‌, ర‌న్న‌ర‌ప్‌గా దీప్తి పేరు ఎనౌన్స్ చేశారు. విజేత‌ల‌ని బిగ్ బాస్ అభినందించారు. ఇక ఈ రోజు శ‌నివారం కావ‌డంతో నాని సంద‌డి షురూ కానుంది. నేటి ఏపిసోడ్‌లో నాని ఏయే విష‌యాల‌పై చ‌ర్చ జ‌రుపుతాడో చూడాలి.

9132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles