నాగ్ చిత్రంతో ప‌రిచ‌యం కానున్న నూత‌న నాయిక‌

Tue,December 3, 2019 12:03 PM

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ప‌క్క రాష్ట్రాల‌ భామ‌ల హ‌వా న‌డుస్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా మ‌ల‌యాళీ భామ‌లు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నారు. నాగార్జున సినిమాతో మ‌రో నూతన భామ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానున్న‌ట్టు టాక్. చివ‌రిగా మ‌న్మ‌థుడు 2 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన నాగార్జున త్వ‌ర‌లో సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే చిత్రం చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కాని స్క్రిప్ట్ విష‌యంలో కాస్త తేడా రావ‌డంతో ఆ ప్రాజెక్ట్ అట‌కెక్కిన‌ట్టు స‌మాచారం.


నూత‌న ద‌ర్శ‌కుడు సాల్మ‌న్‌తో క‌లిసి నాగ్ త‌న త‌దుపరి ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వచ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో క‌థానాయిక పాత్ర చాలా కీల‌కంగా ఉండ‌డంతో పాటు కాస్త భిన్నంగా ఉంటుంద‌ట‌. అందుకోసం తెలుగు ప్రేక్ష‌కులకి ప‌రిచ‌యం లేని కొత్త అమ్మాయితే బాగుంటుంద‌ని భావించిన చిత్ర బృందం కొత్త అమ్మాయిని అన్వేషించే ప‌నిలో ప‌డింద‌ట‌.

1176
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles