ఆవిరైన ప్ర‌భుదేవా ఆశ‌లు..!

Sat,July 22, 2017 03:55 PM
new director comes to the race in salman movie

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ సినిమాల స్పీడు పెంచాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమా క‌న్ ఫాం చేశాడు. ఇటీవ‌ల ట్యూబ్ లైట్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌ల్మాన్ ఇప్పుడు టైగ‌ర్ జిందా హై అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ద‌బాంగ్ 3 చిత్రం కూడా త‌ప్ప‌క వ‌స్తుంద‌నే విష‌యాన్ని క‌న్ ఫాం చేశాడు. అర్భాజ్ ఖాన్- స‌ల్మాన్ ఖాన్ కాంబినేష‌న్ లో ద‌బాంగ్, ద‌బాంగ్ 2 చిత్రాలు తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు మూడో పార్ట్ కూడా వీరి కాంబినేష‌న్ లో వ‌స్తుంద‌ని భావించిన‌ప్ప‌టికి, ఈ ప్రాజెక్ట్ హ్యండిల్ చేయ‌డానికి ద‌ర్శ‌కుడు అర్భాజ్ రెడీగా లేడ‌ట‌. ఈ క్ర‌మంలో ప్ర‌భుదేవా ద‌బాంగ్ 3 చిత్రాన్ని హ్యండిల్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. స‌ల్మాన్ ఖాన్ తో సినిమా అంటే అది ఎలాంటి మూవీ అయిన చేయ‌డానికి సిద్ధ‌మేన‌ని ప్ర‌భుదేవా కూడా అన‌డంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ద‌బాంగ్ 3 రావ‌డం ప‌క్కానే అని ఫ్యాన్స్ భావించారు. కాని తాజాగా ఫ్రేమ్ లోకి బాఘీ ద‌ర్శ‌కుడు స‌బీర్ ఖాన్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ముంబై మిర్ర‌ర్ పత్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌బీర్ తాను ద‌బాంగ్ కి స్క్రిప్ట్ రెడీ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించాడ‌ట‌. ఫైన‌ల్ స్క్రిప్ట్ పూర్త‌య్యే వ‌ర‌కు తాను ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తానో లేదో చెప్ప‌లేన‌ని స‌బీర్ అన్నాడు. ఒక‌వేళ‌ స‌బీర్ స్క్రిప్ట్ ఓకే అయి సినిమా సెట్స్ పైకి వెళ్తే ప్ర‌భుదేవా ఆశ‌ల‌కి గండి ప‌డినట్టే. ద‌బాండ్ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మించనున్నాడు.

1743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles