కొరియ‌న్‌ చిత్రానికి రీమేక్‌గా న‌య‌న‌తార 65వ చిత్రం!

Tue,September 17, 2019 10:40 AM

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార స‌రికొత్త ప్ర‌యోగాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమె న‌టించిన‌ ద‌ర్భార్, బిగిల్, సైరా చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది ఈ సొగసరి. నయనతార కథానాయికగా ‘నెట్రికన్‌' పేరుతో ఓ చిత్రం ప్రారంభమైంది. ఆమె ప్రియుడు విఘ్నేష్‌శివన్‌ తొలిసారి నిర్మాణ బాధ్యతల్ని చేపడుతూ రౌడీ పిక్చర్స్‌ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇందులో బ్రెయిలీ లిపిలో రాసిన అక్షరాల్ని ఓ యువతి చేతితో తడుముతూ ఉంది. సంకెళ్లు, రక్తం మరకలతో నిండివున్న ఈ పోస్టర్‌ ఆసక్తిని పంచింది.


క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ‘నెట్రికన్‌' చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న 65వ సినిమా ఇది. ‘నెట్రికన్‌' టైటిల్‌తో 1981లో బాలచందర్‌ నిర్మాణంలో రజనీకాంత్‌ సినిమా చేశారు. నయనతార చిత్రానికి ఈ టైటిల్‌ను నిర్ణయించడం తమిళ చిత్రసీమలో ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే ఈ చిత్రం కొరియ‌న్ థ్రిల్ల‌ర్ బ్లైండ్ మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ట్టు స‌మాచారం. దీనిపై అతి త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.

791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles