విజ‌య్ దేవ‌ర‌కొండ 'కూల్ చిక్' కామెంట్‌ పై నెటిజ‌న్స్ ఫైర్‌

Tue,April 24, 2018 12:37 PM
netigens fire on vijay devarakonda

అర్జున్ రెడ్డి సినిమాతో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. అర్జున్ రెడ్డి చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ కుర్ర హీరో అల‌నాటి అందాల న‌టి మ‌హాన‌టి చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో సావిత్రి సినిమాకి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ వాట్ ఏ కూల్ చిక్ అని కామెంట్ పెట్టాడు. దీనిపై వివాదం నెల‌కొంది. గ‌తంలో అర్జున్ రెడ్డి చిత్ర స‌మ‌యంలో చిల్ అనే ప‌దంతో హాట్ టాపిక్‌గా నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం చిక్ అనే ప‌దంతో వార్త‌ల‌లో నిలిచాడు. మ‌హాన‌టి సావిత్రి పోస్ట‌ర్‌పై చిక్ అనే కామెంట్ పెట్ట‌డంతో నెటిజ‌న్స్ విజ‌య్ దేవ‌ర‌కొండపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

త‌న‌పై కామెంట్స్ చేస్తున్న నెటిజ‌న్స్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస పోస్టుల ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సావిత్రి ఎంత అందంగా ఉండేవారు. ఆమెకి కార్లంటే చాలా ఇష్టం. చెన్నైలో ఉన్న‌ప్పుడు ఆమె నివాసంలో ఎన్నో వింటేజ్‌ కార్లు ఉండేవట. ఆమె ఎప్పుడు ఎవరికి భ‌య‌ప‌డేవారుకాదు. స‌మాజానికి చాలా మంచి చేశారు. త‌న‌ని అంద‌రు ప్రేమించాల‌నుకున్నారు, ప్రేమ‌ని పొందాల‌నుకున్నారు ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్‌గా అవ్వాల‌ని క‌లలు క‌న్నారు. సావిత్రి విష‌యంలో క్షమాపణ కోరుకునే వాళ్లంతా చెన్నై లీలా ప్యాలెస్‌కి వ‌చ్చేయండి . అక్క‌డే ఉన్నాను. నేను మహానటి ఆడియో లాంచ్ ఎంట్రీలు కూడా ఇస్తాను. ఆమె మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మీ లాంటి నైతిక విలువలు ఉన్నవాళ్లూ.. నీతిమంతుల బ్యాచ్ అంతా సంసారం నాశనం చేసుకుంద‌ని.. తాగుబోతు అని పిలిచారు. మీరు చేసిన కామెంట్లతో పోలిస్తే నేను ‘వాట్ ఏ కూల్ చిక్’ అన్నందుకు ఆమె చాలా సంతోషించి ఉంటారు’’ అని విజయ్ త‌న ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. మ‌హాన‌టి చిత్రం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌గా, ఈ మూవీని మే 9న విడుద‌ల చేయ‌బోతున్నారు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.


6074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles