చిన్నారి మెడ‌లో పాము.. చుర‌క‌లు అంటించిన నెటిజ‌న్స్

Fri,August 23, 2019 08:49 AM
netigens fire on Kim Kardashian

ప్రముఖ హాలీవుడ్‌ టీవీ సెలబ్రెటీ కిమ్‌ కర్దాషియన్ పేరు వార్త‌ల‌లో నిలిచిందంటే ఏదో ఒక సంచ‌ల‌నం ఉండి తీరుతుంది. తాజాగా ఈ అమ్మ‌డు కూతురు షికాగో వెస్ట్ మెడ‌లో పాము వేసి ఆ దృశ్యాన్ని వీడియో తీసింది. దానిని సోష‌ల్ మీడియ‌లో షేర్ చేస్తూ .. ‘మై బ్రేవ్‌ గర్ల్‌ షికాగో’ అనే క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియోని చూసిన నెటిజ‌న్స్ కిమ్ క‌ర్దాషియ‌న్‌పై నిప్పులు చెరిగారు. అభం శుభం తెలియ‌ని చిన్నారి మెడ‌లో పాము వేసి ఇలాంటి వికృత చ‌ర్య‌లు చేయ‌డం ఏ మాత్రం క‌రెక్ట్ కాదు. విష‌పూరితమైన పాముల‌తో చెల‌గాటాలు అవ‌స‌ర‌మా ? పాములు కూడా జీవులే, వాటిని ఆట‌వ‌స్తువులుగా చూడ‌డం చాలా త‌ప్పు అని నెటిజ‌న్స్ .. కిమ్‌కి చుర‌క‌లింటించారు. ఈ అమ్మ‌డికి న‌లుగురు పిల్ల‌లు ఉన్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

My brave girl Chicago 🐍

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

3068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles