కారు పాడైంద‌ని డైరెక్ట‌ర్ మారుతికి ట్వీట్ చేసిన నెటిజ‌న్

Thu,January 3, 2019 08:44 AM

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌గా మారిన ద‌ర్శ‌కుడు మారుతి చివ‌రిగా శైల‌జా రెడ్డి అల్లుడు అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. ఇక‌ ఆయ‌న త‌ర్వాతి సినిమా ఏంటనే దానిపై ఇంత‌వ‌ర‌కు క్లారిటీ లేదు. అయితే ద‌ర్శ‌కుడు మారుతి దాస‌రికి ట్విట్ట‌ర్‌లో విచిత్ర అనుభ‌వం ఎదురైంది. శరవణ కుమార్ అనే వ్య‌క్తి .. నా మారుతి స్విఫ్ట్ కారు ఇంజిన్ కాలిపోయింది. దీన్ని 2015 మేలో కొనుగోలు చేశా. బీమా ఉంది కానీ, కవరేజ్‌లో లేదు. దీంతో కారులోని భాగాలను మళ్లీ అమర్చడానికి రూ.1,80,000 అడిగారు. ఇంజన్‌కు కనీసం ఐదేళ్ల వారెంటీ ఉంటుంది. కానీ, నా కారు విషయంలో మాత్రం వారెందుకు డబ్బులు అడుగుతున్నారు?’ అంటూ మారుతి కంపెనీకి ట్వీట్ చేయ‌బోయి పొర‌పాటున ద‌ర్శకుడు మారుతికి ట్వీట్ చేశాడు. దీనికి మారుతి హుందాగా బదులిచ్చాడు. డియ‌ర్ స‌ర్‌.. నేను సినిమా డైరెక్ట‌ర్ మారుతిని. నాకు మారుతి స్విఫ్ట్‌ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు. మీ ఫిర్యాదు సరైన వారికి చేరుతుందని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్‌’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. విష‌యం తెలుసుకున్న శరవణ సదరు ట్వీట్‌ను డిలీట్ చేశారు.



2920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles