ఎన్టీఆర్‌ని కొట్టిన వాడిని మ‌నోజ్ ఏం చేశాడో తెలుసా ?

Wed,September 26, 2018 01:51 PM
netigen asks a funny question to manoj

మంచు వార‌బ్బాయి మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు సంఘ‌ట‌న‌ల‌పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తున్న మ‌నోజ్‌కి ఓ నెటిజ‌న్ ప్రశ్న వేశాడు. చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరో ఒకతను కొట్టారట. అప్పుడు మీరు వెళ్ళి వాడి చెయ్యి విరగ్గొట్టాడట. చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి చెప్పమని ఓ అభిమాని మనోజ్ ని కోరాడు. దాంతో మనోజ్ ఆ అభిమానికి సమాధానంగా నవ్వుతూ.. ‘తారక్‌నే అడుగు. ఈ విషయం గురించి నాకంటే తనే బాగా చెప్తాడు’ అని పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అయింది. మ‌నోజ్‌, జూ. ఎన్టీఆర్ బాల్య స్నేహితులు కాగా ఇటీవ‌ల హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో ఎన్టీఆర్‌కి మనోజ్ బాడీ గార్డ్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా మ‌నోజ్ సినిమాల‌కి దూరంగా ఉన్నాడు. అతి త్వ‌ర‌లో మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్న‌ట్టు తెలుస్తుంది. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ అర‌వింద స‌మేత అనే చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ మూవీ అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది.6568
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles