నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలి ప్రీక్వెల్

Thu,August 2, 2018 02:36 PM
Netflix will telecast Baahubali Before the Beginning prequel

సంచలన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఈ క్రమంలోనే బాహుబలి టీం అమెజాన్ ప్రైమ్‌లో బాహుబలి: ది లాస్ట్ లిజెండ్స్ అనే యానిమేటెడ్ సిరీస్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలి ప్రీక్వెల్ విడుదల కానుంది.

నెట్‌ఫ్లిక్స్ సంస్థ బాహుబలి టీంతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే త్వరలో అందులో బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ పేరిట ఓ ప్రీక్వెల్ విడుదల కానుంది. దీన్ని దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులు తెరకెక్కిస్తారు. బాహుబలి: ది బిగినింగ్, ది కన్‌క్లూషన్ సినిమాలకు ప్రీక్వెల్‌గా బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ ను విడుదల చేయనున్నారు. ఆనంద్ నీలకంఠన్ పుస్తకమైన ది రైజ్ ఆఫ్ శివగామి ఆధారంగా ఈ సీరియల్‌ను తెరకెక్కిస్తారు. ఇందులో రెండు సీజన్లు ఉంటాయి. మొదటి సీజన్‌లో 9 ఎపిసోడ్లను తెరకెక్కించనున్నారు. రెండు సీజన్లను ప్రసారం చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ హక్కులు సంపాదించింది. అయితే ఈ సీజన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వివరాలను వెల్లడించలేదు. త్వరలో ఆ విషయం తెలుస్తుంది.

1384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles