ఆగ‌స్ట్ 8న బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు వ‌స్తున్న స్టార్ హీరో

Tue,July 16, 2019 09:22 AM
NerKonda Paarvai Releasing Worldwide on August 8th

తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అజిత్‌కే ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌ని చెప్ప‌వచ్చు. ప్ర‌స్తుతం అజిత్ ప్రస్తుతం బోని క‌పూర్‌ నిర్మాణంలో పింక్ రీమేక్ చిత్రంగా నెర్కొండ పార్వాయి అనే చిత్రం చేస్తున్నాడు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించనున్నారు. పింక్ చిత్రం హిందీలో మంచి హిట్ కావ‌డంతో పాటు ఈ చిత్ర రీమేక్‌ని అజిత్‌తో చేయాల‌ని శ్రీదేవి కోరిక‌ట‌. ఈ నేప‌థ్యంలో అజిత్ హీరోగా త‌మిళంలో పింక్ రీమేక్ అవుతుంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్స్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. లాయ‌ర్ పాత్ర‌లో అజిత్ అల‌రించాడు. మిగతా నటీన‌టులు కూడా పాత్ర‌కి త‌గ్గ ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రచిన‌ట్టు ట్రైలర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా త‌మిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ భార్య‌గా విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఈమెకి ఈ చిత్రం త‌మిళంలో తొలి మూవీ . గిబ్రాన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు . అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఉందో తెలియాల్సి ఉంది.

2366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles