పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాని సినిమా

Wed,August 10, 2016 11:53 AM
nenu local movie pooja comleted

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో మంచి ఊపుమీదున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం నుండి మొదలుకొని నానికి వరుస సక్సెస్‌లు వస్తుండడంతో తన స్పీడ్ మరింత పెంచాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ఓకే చేస్తున్నాడు. ఇటీవల నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మన్ చిత్రం మంచి విజయం సాధించడంతో రాబోవు సినిమాలను కూడా పక్కా ప్లాన్‌తో విడుదల చేయనున్నాడు. విరంచి వర్మ-నాని కాంబినేషన్‌లో తెరక్కెకిన మజ్ఞు చిత్రం సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకి రాబోతుండగా ఈ లోపే తన నెక్ట్స్ మూవీకి పూజా కార్యక్రమాలు పూర్తి చేశాడు. నేను లోకల్ అనే టైటిల్‌తో నాని తర్వాతి చిత్రం రాబోతుండగా ఈ సినిమాను సినిమా చూపిస్త మావ ఫేం త్రినాధ రావు నక్కిన రూపొందించనున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని చిత్రీకరించనుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి, నవీన్ చంద్ర, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. అల్లు అరవింద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.

1515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS