తాప్సీ మరో హిట్ కొట్టడం ఖాయం!

Sun,February 26, 2017 12:35 PM
Nene Shabana  telugu trailer

సొట్టబుగ్గల సుందరి తాప్సీకి టాలీవుడ్ అంతగా కలిసిరాకపోయినప్పటికి హిందీలో మాత్రం మంచి విజయాలు సాధిస్తూ ఫుల్ క్రేజ్ పెంచుకుంటుంది. పింక్ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ తో ఘాజీలో నటించింది తాప్సీ. తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో పాటు నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రానా, తాప్సీల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక బేబి మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ నామ్ షబానా అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది తాప్సీ. శివం నాయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రంలో తాప్సీ బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేసింది. ఈ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది . మార్చి 31,2017న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య హిందీలో విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. నేనే షబాన అనే టైటిల్ తో ఈ చిత్రం తెలుగులో విడుదల కానుండగా ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులని అలరించేలా ఉంటుందని టీం భావిస్తున్నది. ముఖ్యంగా ఈ చిత్రం తాప్సీ ఖాతాలో మరో హిట్ గా చేరుతుందని అంటున్నారు. తాప్సీ నటించిన 'రన్నింగ్‌ షాదీ డాట్‌ కామ్‌' చిత్రం కూడా త్వరలోనే విడుదల కానుంది.

1706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles