నేల‌ టికెట్ ధ‌ర 25 కోట్లా ..!

Wed,February 21, 2018 11:36 AM
Nela Ticket  gets huge price

బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మాస్ మ‌హ‌రాజా స్పీడ్ పెంచాడు. రీసెంట్ గా రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. ఇక ట‌చ్ చేసి చూడు చిత్రంతో కాస్త అల‌రించిన ర‌వితేజ ప్ర‌స్తుతం సోగ్గాడే చిన్న నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్ధాం వంటి హిట్ చిత్రాల‌ని తెర‌కెక్కించిన క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు . గ్రామీణ‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ మూవీకి నేల టికెట్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శాటిలైల్‌, డిజిటల్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్ మొత్తం క‌లిపి రూ.25కోట్లకు ఓ ప్రముఖ టెలివిజన్‌ దక్కించుకుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. షూటింగ్‌ దశలో ఉండగానే ఈ స్థాయిలో బిజినెస్‌ జరగడం రవితేజ స్టామినాకు నిదర్శనమని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. మాళవిక శర్మ ఇందులో కథానాయికగా నటిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఈ మూవీ త‌ర్వాత త‌న‌కి వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తుండగా, ఈ మూవీకి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇందులో ర‌వితేజ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్.

2275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles