మర్డర్ మిస్టరీ..‘బైపాస్ రోడ్’ ట్రైలర్

Mon,September 30, 2019 04:37 PM


బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేశ్ నటిస్తోన్న చిత్రం ‘బైపాస్ రోడ్’. నీల్ నితిన్ ముఖేశ్ సోదరుడు నమన్ నితిన్ ముఖేశ్ దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజా ప్రాజెక్టులో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. టీవీ నటి శర్మ సికందర్ సారా అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. సారా హత్య కేసుకు సంబంధించిన మిస్టరీని ఛేదించే నేపథ్యంలో..ఆసక్తికరంగా, యాక్షన్ సన్నివేశాలతో సాగే ట్రైలర్ ఉత్కంఠగా సాగుతోంది. రజిత్ కపూర్ నీల్ నితిన్ ముఖేశ్ తండ్రి పాత్రలో కనిపించనుండగా..గుల్ పనాగ్ పినతల్లిగా నటిస్తోంది. బైపాస్ రోడ్ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే, సంభాషణలు నీల్ నితిన్ ముఖేశ్ అందిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles