ర‌ణ్‌బీర్ క‌పూర్ ఫ్యామిలీతో దీపికా.. ఫోటోలు వైర‌ల్‌

Wed,May 15, 2019 09:48 AM

చాక్లెట్ బాయ్ ర‌ణ్‌బీర్ క‌పూర్, ప‌ద్మావ‌త్ హీరోయిన్‌ దీపికా ప‌దుకొణేలు కొన్నాళ్ళ‌పాటు ప్రేమాయ‌ణంలో ఉండ‌గా ప‌లు కార‌ణాల వ‌ల‌న వారి ప్రేమ‌కి బ్రేక్ ప‌డింది. దీంతో నాలుగేళ్ళుగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాలు కూడా రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే వీరరివురు పాత గొడ‌వులు మ‌ర‌చిపోయి స్నేహితులుగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో వీరిద్ద‌రు క‌లిసి ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నార‌నే వార్త ఇటీవ‌ల‌ హాట్ టాపిక్‌గా మారింది. లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌, దీపికా చిత్రం నుండి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ ప్రాజెక్ట్ మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. డిసెంబ‌ర్ 2020లో ఈ చిత్రం థియేట‌ర్స్‌లోకి రానుంద‌ని అంటున్నారు. టీ సిరీస్‌, ల‌వ్ ఫిలింస్‌తో క‌లిసి భూష‌ణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించ‌నున్నాడు. అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ చిత్రం చేయ‌నున్నార‌ని అంటున్నారు. ఇందులో ర‌ణ్‌బీర్‌, దీపిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నార‌ట‌.

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, ర‌ణ్‌బీర్ తండ్రి రిషి క‌పూర్ కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతుండ‌గా, ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నాడు. గ‌త ఎనిమిది నెల‌లుగా చికిత్స తీసుకుంటున్న త‌న‌కి ప్ర‌స్తుతం ఎలాంటి చికిత్స అవ‌స‌రం లేద‌ని వైద్యులు అన్న‌ట్టు రీసెంట్‌గా తెలిపాడు రిషి . బోన్‌ మ్యారో చికిత్స ఒక్కటి మిగిలి ఉన్నది. దానికి మరో 2 నెలల పడుతుందన్నారు వైద్యులు. అది పూర్తయ్యాక ముంబయికి తిరిగి వస్తాను అని రిషి కపూర్‌ తెలిపారు. అయితే రీసెంట్‌గా న్యూయార్క్ వెళ్లిన దీపిక ఆసుప‌త్రిలో ఉన్న రిషి క‌పూర్‌ని ప‌రామ‌ర్శించింది. కపూర్‌ దంపతులను కలిసి కాసేపు వారితో ముచ్చటించింది. ఈ సందర్భంగా దీపికాకు బ్రేస్‌లెట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్.. దీపిక రాకతో మా సాయంత్రం ఎంతో ఆత్మీయంగా మారింది. మాపై ఎంతో ప్రేమను కురిపించింది’ అంటూ ఆమెతో దిగిన ఫోటోల‌ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో బిజీగా ఉండ‌గా, దీపిక మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌పాక్ అనే చిత్రం చేస్తుంది.

2087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles