డియ‌ర్ కామ్రేడ్ నుండి నీ నీలి క‌న్నుల్లో.. వీడియో సాంగ్ విడుద‌ల‌

Tue,July 30, 2019 11:45 AM

గీతగోవిందం తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ క‌లిసి న‌టించిన‌ చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళుతుంది. ముఖ్యంగా జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన సంగీతం సినిమాల‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెంచింది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా తాజాగా ‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..తెల్లారి అల్లేసింది నన్నే..నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి..నీ వైపే లాగేస్తుంది నన్నే’ అంటూ సాగే పాట ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. అద్భుతమైన లిరిక్స్‌తో పాటు విజువ‌ల్స్ అందరినీ అలరిస్తున్నాయి. గౌతమ్ భరద్వాజ్ ఆలపించిన ఈ పాట‌కి రెహ‌మాన్ లిరిక్స్ అందించారు. డియ‌ర్ కామ్రేడ్ చిత్రం హిందీలోను రీమేక్ కానుంది. ద‌ఢ‌ఖ్ పెయిర్ ఇషాన్, జాన్వీ క‌పూర్ రీమేక్ చిత్రంలో హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తార‌ని సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు పుట్టుకొస్తున్నాయి . ద‌ఢ‌ఖ్ చిత్రంలో వీరిద్ద‌రి కెమిస్ట్రీకి మంచి ప్రశంస‌లు ల‌భించ‌డంతో క‌ర‌ణ్ జోహార్ డియ‌ర్ కామ్రేడ్ రీమేక్ చిత్రంలో వారిద్ద‌రిని ఎంపిక చేశాడ‌ని చెబుతున్నారు

1041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles