యాక్ష‌న్ మూడ్‌లోకి బాల‌య్య‌

Thu,September 5, 2019 11:48 AM

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న 105వ చిత్రాన్ని కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రూల‌ర్ అనే పేరుతో ఈ చిత్రం ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, బాల‌య్య‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఇందులో బాల‌య్య లుక్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చింది. సోనాల్ చౌహ‌న్‌, వేదిక చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని తెలుస్తుండ‌గా, భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇక విల‌న్‌గా త‌మిళ భామ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ని తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావించిననప్పటికి, అది వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో ఆమె స్థానంలో న‌మిత లేడీ విల‌న్‌గా చిత్రంలో అల‌రించ‌నుంద‌ని చెబుతున్నారు. చిత్రంలో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్‌గా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు పాత్ర‌లు పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. జై సింహా త‌ర్వాత కేఎస్ ర‌వికుమార్- బాల‌య్య కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుండ‌డంతో ఈ సినిమా పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ ఎపిసోడ్ రామోజీ ఫిలిం సిటీలో మొద‌లు పెట్టారు. అన్బూ, అర‌వి యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేయ‌నున్నారు.

1151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles