రాధికాశరత్‌కుమార్‌కు నోటీసులు:నాజర్

Sun,December 27, 2015 07:21 PM
Nazar Says on Notice to Radhikasharath


చెన్నై: కోలీవుడ్ నటి రాధికాశరత్‌కుమార్ కు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని సౌత్ ఇండియన్ యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాజర్ అన్నారు. తమిళ నటుడు శింబు బీప్ సాంగ్ వివాదం అంశంలో ఆయన పైవిధంగా స్పందించారు. చైన్నైలోని ఓ హోటల్‌లో సంఘం సభ్యులు నిన్న సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ శింబు విషయంలో సంఘం జోక్యం చేసుకోలేదన్న రాధికా శరత్‌కుమార్ ఆరోపణలు సరైనవి కాదన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. బీప్ సాంగ్ వ్యవహారంలో తామే శింబు కుటుంబసభ్యులతో సంప్రదించి సమస్య పరిష్కారానికి సాయం చేస్తామని చెప్పామన్నారు. శింబు మాత్రం సమస్యను కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పాడని నాజర్ వెల్లడించారు.

4063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles