విఘ్నేష్‌, న‌య‌న్ వైర‌ల్ పిక్ అదుర్స్‌

Sat,February 17, 2018 09:42 AM
Nayanthara , Vignesh Shivan viral pic

ఈ మ‌ధ్య కాలంలో కొన్ని ప్రేమ జంట‌లు అభిమానుల‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో స‌మంత‌- నాగ చైత‌న్య , బాలీవుడ్‌లో అనుష్క- విరాట్ కోహ్లి, కోలీవుడ్‌లో న‌య‌న‌తార - విఘ్నేష్ శివ‌న్‌ల ప్రేమాయ‌ణం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ అవుతూ ఉంది. అయితే ఈ మూడు జంట‌ల‌లో చైతూ- సామ్‌, విరాట్‌- అనుష్క‌ల జంట ఇప్ప‌టికే పెళ్ళి పీట‌లెక్క‌గా న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్‌లు అభిమానుల‌ని స‌స్పెన్స్‌లో పెడుతూ వ‌స్తున్నారు. ప‌లు సంద‌ర్భాల‌లో ఇద్ద‌రు చాలా క్లోజ్‌గా ఫోటోలు దిగి, వాటిని సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేస్తున్నారు. వీరి రిలేష‌న్‌పై అభిమానులు , మీడియా ప‌లు కామెంట్స్ చేస్తున్న‌ప్ప‌టికి వీరిరివురు స్పందిచ‌డం లేదు. మొన్నామ‌ధ్య విఘ్నేష్‌తో క‌లిసి విదేశాల‌కి వెళ్ళిన న‌య‌న్‌, క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఆయ‌న‌తో క‌లిసి ఫోటోలు దిగింది. ఈ ఫోటోల‌ని విఘ్నేష్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ న‌య‌న‌తార కెరీర్‌లో 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా విషెస్ తెలిపాడు. ఇక తాజాగా వేలంటైన్స్ డే సంద‌ర్భంగా నయనతార, విఘ్నేశ్‌శివన్ ఇద్ద‌రు క్లోజ్‌గా ఓ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. ఇక్క‌డ‌ విశేషమేమిటంటే వీరు ధరించిన టీషర్టులపై వారి పేర్లు ప్రతిబించేలా వీ ఎన్‌ అనే ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 25తో ఇండ‌స్ట్రీలో 14ఏళ్ళ జ‌ర్నీ పూర్తి చేసుకున్న న‌య‌న‌తార ప్ర‌స్తుతం తెలుగులో సైరా చిత్రం చేస్తుంది. తమిళంలో ‘ఇమైకా నొడిగల్‌’, ‘కొలైయుదిర్‌ కాలం’, ‘కోలమావు కోకిల’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన‌ తానా సెరెందా కూట్ట‌మ్ ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

2556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles