మ‌రోసారి రజ‌నీకాంత్‌కి జోడీగా న‌య‌న‌తార‌..!

Sun,February 17, 2019 12:01 PM
nayanthara screen share with rajanikanth

చంద్ర‌ముఖి చిత్రంలో ర‌జ‌నీకాంత్‌తో జ‌త‌క‌ట్టి మంచి పేరు తెచ్చుకున్న న‌య‌న‌తార ఆ త‌ర్వాత వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా మారింది. ఈ సినిమాతో కేవ‌లం త‌మిళంలోనే కాదు తెలుగులోను న‌య‌న్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. చంద్ర‌ముఖి చిత్రం త‌ర్వాత న‌య‌న‌తార కుసేల‌న్‌, శివాజీ చిత్రాల‌లో ర‌జనీకాంత్‌తో క‌లిసి ఓ సాంగ్‌లో ఆడిపాడింది. మ‌ళ్ళీ చాన్నాళ్ల త‌ర్వాత ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించేందుకు ఈ అమ్మ‌డు సిద్ధ‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ర‌జ‌నీకాంత్‌- మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ 166 వ చిత్రంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో కాకుండా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని అన్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. అయితే ఇందులో క‌థానాయిక‌గా న‌య‌నతార అయితే బాగుంటుంద‌ని భావించిన నిర్మాత‌లు ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపార‌ట‌. కాల్షీట్స్ ఖాళీ లేక‌పోయిన కూడా స‌ర్ధుబాటు చేసుకొని సినిమాలో న‌టిస్తాన‌ని చెప్పింద‌ని తెలుస్తుంది. మ‌రి ఈ విష‌యంపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి

1758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles