న‌య‌న‌తార బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సైరా మోష‌న్ పోస్ట‌ర్

Sun,November 18, 2018 10:29 AM
Nayanthara Motion Teaser released

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న చిత్రం సైరా. చిరు ప్ర‌ధాన పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన ఫోటోల‌ని వారి బ‌ర్త్‌డే సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్న టీం తాజాగా న‌య‌న‌తార బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ఆమె పాత్ర‌కి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. సిద్ధ‌మ్మ అనే పాత్ర‌లో న‌య‌న‌తార ఎంతో హుందాగా క‌నిపిస్తుంది. ఇంత‌క‌ముందు సెట్‌లో చిరు, న‌య‌న‌తార‌తో క‌లిసి ఉన్న ఫోటోని అమితాబ్ షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే . బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ రాజ‌గురువు గోస‌యి వెంక‌న్న‌ పాత్ర‌లో క‌నిపించనున్నట్టు తెలుస్తుంది. విజ‌య్ సేతుప‌తి, సుదీప్ , జ‌గ‌ప‌తి బాబు, తమన్నా త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌త్న‌వేలు ఉన్నారు


924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles