న‌య‌న‌తార చిత్రానికి స‌మ‌స్య‌లు

Wed,June 12, 2019 09:18 AM
Nayanthara Kolaiyuthir Kaalam Is Put On A Temporary Ban By Court

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న నయన తార ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె న‌టించిన‌ త‌మిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌బించింది. ప్ర‌స్తుతం సైరా చిత్రంతో పాటు ద‌ర్భార్, ‘కొలైవుదిర్ కాలమ్’ చిత్రాల‌తో బిజీగా ఉంది న‌య‌న్. కొలైవుదిర్ కాలమ్ చిత్రంతో ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారబోతుండగా, ఈనాడు, బిల్లా 2 ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. హరర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం లేడి ఓరియెంటెడ్ మూవీగా ఉండనున్నట్టు సమాచారం. ఎన్నో ట‌ర్న్స్ అండ్ ట్విస్ట్ లతో ఉండ‌నున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం చిత్ర విడుద‌ల‌కి అడ్డంకులు ఎదురైన‌ట్టు తెలుస్తుంది. ఫిలిం మేకర్ బాలాజీ కుమార్ తాను సుజాత న‌వ‌ల నుండి సేమ్ టైటిల్‌తో చిత్ర రైట్స్ తీసుకోగా, ఇప్పుడు న‌య‌న‌తార టీం కూడా అదే టైటిల్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంది. ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార చిత్రాన్ని ఆపాల‌ని కోర్టు మెట్లెక్కాడు బాలాజీ. ఈ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపిన కోర్ట్‌ రిలీజ్‌కి తాత్కాలిక బ్రేక్ వేయ‌మ‌ని కోరింది. అంతేకాదు జూన్ 21, 2019 లోపు నిర్మాత‌లు దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. దీంతో జూన్ 14న విడుద‌ల కావ‌ల‌సిన‌ కొలైవుదిర్ కాలమ్ చిత్రం కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డ‌నుంది.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles