రజనీ ‘దర్బార్’ షూటింగ్‌లో నయనతార..వీడియో

Tue,April 23, 2019 04:31 PM
Nayanthara joins Darbar shooting today


ముంబై: తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం దర్బార్. ముంబైలో ఇటీవలే గ్రాండ్ ఈ సినిమా షూటింగ్ షురూ అయింది. రజనీకాంత్ తొలి రోజు నుంచే షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మూవీ షూట్‌లో హీరోయిన్ నయనతార జాయిన్ అయింది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నయనతార స్టిల్‌ను పోస్ట్ చేసి..అభిమానులకు తెలియజేసింది. రజనీ ఈ చిత్రంలో ద్విపాత్రాభియం చేస్తున్నాడు. రజనీకాంత్ ‘దళపతి’ సినిమాకు పనిచేసిన సంతోష్ శివన్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ ‘దర్బార్’ కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. రజనీ దర్బార్ షూటింగ్‌లో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టులో రజనీ ముంబై సిటీ పోలీస్ కమిషనర్ (ఐపీఎస్ అధికారి)గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.1162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles