చిన్నారితో న‌య‌న్‌.. వైర‌ల్‌గా మారిన వీడియో

Sun,December 16, 2018 07:15 AM
Nayantara funny time with kid

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాయి. కొలమావుకోకిల, ఇమైకా నోడిగల్ చిత్రాలు న‌య‌న‌తార ఇమేజ్‌ని మ‌రింత పెంచాయి. ప్ర‌స్తుతం శివకార్తికేయ‌న్‌కి జోడీగా కామెడీ డ్రామా చిత్రం చేస్తుంది న‌య‌న్‌. ఎం రాజేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్ర షూటింగ్ అజ‌ర్ బైజాన్‌లో జ‌రుగుతుంది. అయితే షూటింగ్ బ్రేక్‌లో న‌య‌న‌తార ఓ చిన్నారితో స‌ర‌దాగా గ‌డ‌ప‌గా, ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. చిన్నారి చేష్ట‌ల‌కి న‌వ్వుతూనే ఉన్న న‌య‌న్‌ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. న‌య‌న‌తార తాజా చిత్రానికి ఎస్‌కే 13 అని పేరు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తుండగా, హిప్‌ హాప్‌ ఆది స్వరాలు సమకూరుస్తున్నారు. త‌మిళంలో అజిత్ స‌ర‌స‌న విశ్వాసం అనే చిత్రంలో న‌టించింది న‌య‌న్‌. ఈ మూవీ సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. ఇక ఐరా, కొల‌యుత్తిర్ కాల‌మ్ అనే త‌మిళ చిత్రాల‌తో పాటు సైరా అనే తెలుగు చిత్రం, ఓ మ‌ల‌యాళ చిత్రంతో బిజీగా ఉంది న‌య‌న్ .


2238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles