న‌య‌న‌తార 'ఐరా' రిలీజ్ డేట్ ఫిక్స్‌

Tue,March 19, 2019 08:42 AM
Nayantara Airaa Movie release date fixed

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార వ‌రుస సినిమాల‌తో జెట్‌లా దూసుకెళుతుంది. రీసెంట్‌గా ఆమె న‌టించిన‌ త‌మిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో విడుద‌లైంది. ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌బించింది. ప్ర‌స్తుతం సైరా చిత్రంతో పాటు పలు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న‌తార కొన్నాళ్ళ నుండి ఐరా అనే చిత్రం చేస్తుంది. కోటపాటి రాజేష్ నిర్మాతగా సర్జన్ కె.ఎమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. న‌య‌న 63వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార డబుల్ రోల్‌లో నటిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 'గ్రహణం' ఫేమ్‌ సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తెలుగు, త‌మిళంలో ఈ చిత్రాన్ని మార్చి 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు.

845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles