బాయ్ ఫ్రెండ్‌తో బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ స్టార్ హీరోయిన్‌

Sat,November 18, 2017 12:49 PM
బాయ్ ఫ్రెండ్‌తో బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ స్టార్ హీరోయిన్‌

ఇటు తెలుగు, అటు త‌మిళ భాష‌ల‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఈ రోజు త‌న బ‌ర్త్‌డే జ‌రుపుకుంటుంది. కొన్నాళ్లుగా ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న ఈ అమ్మ‌డు త‌న బాయ్ ఫ్రెండ్‌ స‌మ‌క్షంలోనే బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకోనున్న‌ట్టు న‌య‌న్ ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఇక విఘ్నేష్ శివ‌న్ కూడా న‌య‌న‌తార‌కి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ.. నిన్ను చూస్తుంటే ఎప్ప‌టికి ప్రౌడ్‌గా ఉంటుంది అంటూ ప‌లు కామెంట్స్‌తో న‌య‌న‌పై త‌న‌కున్న ప్రేమ తెలియ‌జేశాడు. ఇక చాలా క్లోజ్‌గా దిగిన ఫోటోని షేర్ చేయ‌డం బ‌ట్టి చూస్తుంటే వీరిద్ద‌రి మ‌ధ్య త‌ప్ప‌క ప్రేమ ఉంద‌నే అభిప్రాయం కోలీవుడ్ జ‌నాల‌లో క‌లుగుతుంది. ఇద్దరూ ప్రేమలో పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుండటంతో, ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక న‌య‌న‌తార రీసెంట్‌గా అర‌మ్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం సినీ ల‌వ‌ర్స్‌ని ఎంత‌గానో అల‌రించింది. ప్ర‌స్తుతం ఈ మూవీ స‌క్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది న‌య‌న్.

1777

More News

VIRAL NEWS