బాల్‌ఠాక్రే పాత్రలో భజరంగీభాయ్‌జాన్ స్టార్..!

Fri,December 15, 2017 02:11 PM
బాల్‌ఠాక్రే పాత్రలో భజరంగీభాయ్‌జాన్ స్టార్..!


ముంబై: భజరంగీ భాయ్‌జాన్, రయీస్, బద్లాపూర్, లయన్ వంటి మూవీస్‌తోపాటు మరెన్నో చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఈ యాక్టర్ సినిమా సినిమాకి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుంటాడు. తాజాగా నవాజుద్దీన్ బిగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శివసేన పార్టీ వ్యవస్థాపకులు, దివంగత బాల్ ఠాక్రే బయోపిక్‌కు ప్లాన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ లీడ్ రోల్ పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే బయోపిక్ విషయంపై మీడియా ప్రశ్నించగా నవాజుద్దీన్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. బాల్ ఠాక్రే బయోపిక్‌ను శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

1214

More News

VIRAL NEWS