తలైవా సినిమా సెట్స్‌లో జాయిన్ అయిన నవాజుద్దీన్..

Tue,August 28, 2018 07:22 PM
NAWAZUDDIN SIDDIQUI JOINED RAJINIKANTH MOVIE SETS

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నర్, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నవాజుద్దీన్ ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. తాను నటిస్తున్న తొలి తమిళ సినిమా కోసం సెట్స్‌లో డైలాగ్స్ చదువుకుంటున్న ఫొటోను భజరంగీభాయ్‌జాన్ యాక్టర్ ట్విట్టర్ ద్వారా షేర్‌చేసుకున్నాడు. సూపర్‌స్టార్ తలైవాతో పనిచేయడం సంతోషంగా, ఎక్సయిటింగ్‌గా ఉందని ట్వీట్ చేశాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతదర్శకుడు.

2605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles