మ‌ణిర‌త్నం మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ట్రైలర్

Sat,September 22, 2018 11:36 AM
Nawab Official Trailer 2 released

ప్రేమ‌క‌థా చిత్రాల‌ని అందంగా తెర‌కెక్కించే మ‌ణిర‌త్నం తాజాగా అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం తెలుగులో) అనే చిత్రాన్ని చేశాడు. తెలుగులో ఈ చిత్రం న‌వాబ్ టైటిల్‌తో విడుద‌ల కానుంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాకి భారీ ప్ర‌మోష‌న్స్ చెప‌డుతున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడ‌దులైన సాంగ్స్ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ని తారాస్థాయికి తీసుకెళ్ళాయి. ఏఆర్ రెహ‌మాన్ త‌న‌దైన స్టైల్‌లో బాణీలు స్వ‌ర‌ప‌ర‌చారు. ణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్‌, లైకా ప్రొడక్షన్స్‌ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా ఇందులో అంద‌రు హీరోలు అన్న‌ద‌మ్ములుగా కనిపించ‌నున్నార‌ట‌. రాజకీయనాయకుడిగా అరవింద్ స్వామి .. ఇంజనీర్ గా శింబు .. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కనిపిస్తారట. ఈ పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. తాజాగా చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. మీరు ట్రైల‌ర్ చూసి ఎంజాయ్ చేయండి.

981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS