మణిరత్నం డైరక్షన్.. నవాబ్ ట్రైలర్ రిలీజ్

Sat,August 25, 2018 11:38 AM
Nawab film trailer released directed by Maniratnam

హైదరాబాద్: ఫేమస్ డైరక్టర్ మణిరత్నం మళ్లీ మ్యాజిక్ చేశారు. ఎన్నో అద్భుత చిత్రాలు అందించిన ఆ డైరక్టర్ ఇప్పుడు న‌వాబ్‌తో మరో థ్రిల్ ఇవ్వనున్నారు. ఆ ఫిల్మ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఉత్కంఠభరిత సన్నివేశాలతో నవాబ్ ఆకట్టుకుంటున్నది. ఓ డాన్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మద్రాస్ టాకీస్ దీన్ని నిర్మిస్తున్నది. ఈ ఫిల్మ్‌లో ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, సిలంబరసన్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదర్, జయసుధ, అరుణ్ విజయ్‌లు నటిస్తున్నారు. తమిళంలోనూ ఈ సినిమాను చెక్కా చివంతా వనమ్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. ఈ ఏడాది జనవరిలోనే నవాబ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. జూన్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇటీవల సెర్బియాలో ఫైనల్ షాట్స్ తీశారు.

2319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles