'ఆఫీసర్' ఫస్ట్ వీడియో సాంగ్ విడుదల

Tue,May 22, 2018 04:54 PM
Navve Nuvvu Video Song released

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఆఫీసర్. 28 ఏళ్ళ క్రితం శివ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ- నాగ్ కాంబినేషన్ ఇప్పుడు ఆఫీసర్ చిత్రంతో మరో అద్భుతం క్రియేట్ చేస్తామని అంటున్నారు. యాక్షన్ డ్రామాగా ఆఫీసర్ చిత్రం తెరకెక్కగా,ఈ చిత్రాన్ని మే 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కాని నిర్మాణాంతార కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో జూన్ 1న విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా నవ్వే నువ్వు అనే సాంగ్ వీడియో విడుదల చేశారు. సిరాశ్రీ లిరిక్స్ అందించిన ఈ పాటని రమ్య బెహరా పాడారు. నాగ్ కి, పాపకి మధ్య సాగే ఈ సాంగ్ సంగీత ప్రియులని అలరిస్తుంది. రవి శంకర్ చిత్రానికి సంగీతం అందించారు. కిడ్నాప్ అయిన పాపని రక్షించే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్టు అర్ధమైంది.. మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. కంపెనీ బేనర్ పై వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివ, గోవిందా గోవిందా, అంతం చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఆఫీసర్ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

2076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS