సింహానికి గొంతు అరువు ఇస్తున్న నాని

Sat,June 29, 2019 01:01 PM
Natural star Nani joins The Lion King

జులై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ద ల‌య‌న్ కింగ్ చిత్రంకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌లో అమితానందాన్ని క‌లిగిస్తున్నాయి. డిస్నీ సంస్థ నుండి వ‌స్తున్న‌ లయన్‌ కింగ్ చిత్రానికి మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బలమైన, భావోద్రేకాలతో కూడిన కథ, కథనాలతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి . ఒక సింహం తన వీరత్వాన్ని నిరూపించుకుని తనకుంటూ ఒక స్థానాన్ని అధిరోహించడమే లయన్‌కింగ్‌ చిత్ర ఇతివృత్తం . జోన్ ఫావ్రే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోని పాత్ర‌లకు హాలీవుడ్ టాప్‌ స్టార్స్ డబ్బింగ్ అందించారు. తెలుగులోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌డంతో ఇందులోని ప‌లు పాత్ర‌ల‌కి తెలుగు టాప్ స్టార్స్‌తో డ‌బ్బింగ్ చెప్పిస్తున్నారు.

ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రంలో సింబ అనే సింహం, టీమోన్ అనే ముంగిస‌, పుంబా అనే అడ‌వి పంది చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లుగా ఉంటాయి. ముసాఫా అనేది కూడా చిత్ర ప్ర‌ధాన పాత్ర కాగా, బాలీవుడ్‌లో ఈ పాత్ర‌కి షారూఖ్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పారు. ముసాఫా త‌న‌యుడు సినిమాకి హీరో అయిన సింబాకి షారూఖ్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పారు. తెలుగు వెర్షన్‌లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్‌ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. ఇక ప్రధాన పాత్రలైనా స్కార్ పాత్రకు జగపతి బాబు , ముఫాసాకు రవి శంకర్ డబ్బింగ్ చెప్పారు. ఇక సింబా అనే సింహం పాత్ర‌కి నాని డ‌బ్బింగ్ చెప్పిన‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. త‌మిళంలో సింహం పాత్ర‌కి సిద్ధార్ద్ డ‌బ్బింగ్ చెప్పారు. ‘లయన్‌ కింగ్‌’ చిత్రం కొత్త హంగులతో 3డి యానిమేటెడ్‌ సినిమాగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించడం ఖాయ‌మ‌ని టీం అంటుంది .1679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles