రేపు టీజ‌ర్‌తో ప‌ల‌క‌రించ‌బోతున్న నాని

Fri,January 11, 2019 08:13 AM
Natural Star Nani Jersey Teaser on January 12th

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న నాని చివ‌రిగా దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్‌తో ప‌ల‌క‌రించాడు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో జెర్సీ అనే చిత్రం చేస్తున్నాడు . మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది . క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయోద్దు అని జెర్సీకి ట్యాగ్ లైన్‌గా ఉంచారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈచిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని క్రికెట్లో చాలా శిక్షణ తీసుకున్నాడ‌ని అన్నారు . చిత్రంలో క్రికెట‌ర్‌గానే కాదు పెళ్ల‌యిన న‌డివ‌య‌స్కుడు, ముస‌లి వ్య‌క్తిగా కూడా నాని క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. అయితే జ‌న‌వ‌రి 1న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన చిత్ర బృందం రేపు టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. ఈ టీజ‌ర్ నాని అభిమానుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles