పవన్ ర్యాలీలో జాతీయ జెండాకు అవమానం

Mon,January 22, 2018 03:50 PM
National Flag insulated by Pawan Kalyan Fans

జగిత్యాల : సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ర్యాలీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. కొండగట్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో పూజలు చేసిన పవన్.. బయటకు వస్తున్న క్రమంలో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు జాతీయ జెండాలు ఊపారు. ఈ క్రమంలో రెండు జాతీయ జెండాలు చిరిగిపోయినప్పటికీ కార్యకర్తలు పట్టించుకోలేదు. పవన్ కారుపైకి చేరుకోగానే.. అత్యుత్సాహంతో అభిమానులు.. ఆయనపైకి జాతీయ జెండాలను విసిరేశారు. దీంతో పవన్ బౌన్సర్లు.. జాతీయ జెండాలను ఇష్టారాజ్యంగా నలిపి పక్కకు పడేశారు.

ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం 2 గంటలకు కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొండగట్టులో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం పవన్.. రూ. 11 లక్షలు విరాళం ప్రకటించారు.

4656
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles