నయనతారను మాత్రమే పెళ్లి చేసుకుంటాడట..

Mon,May 21, 2018 07:22 PM
natarajan subramaniam says only marry nayanatara


సినిమా సినిమాకు డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ఆడియెన్స్ కు కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది నయనతార. ఈ హీరోయిన్ తాజాగా ‘కోలమావు కోకిల’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోని ఓ సాంగ్ ను చిత్రయూనిట్ మే 16న రిలీజ్ చేసింది. పాటలో నటుడు యోగిబాబు నయనతార ప్రేమ కోసం ఆమె వెంట పడుతూ కనిపిస్తాడు. ఈ పాట 52 లక్షల వ్యూస్ తో..యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ సాంగ్ ను చూసిన ప్రముఖ నటుడు నట్టి నటరాజ్ తనదైన శైలిలో ట్వీట్స్ చేశాడు. తాను కేవలం కోలమావు కోకిలను మాత్రమే పెళ్లి చేసుకుంటానని, ఒకవేళ కుదరకపోతే ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తానని ట్వీట్స్ చేశాడు. నయనతార మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ పాటపై మీరూ ఓ లుక్కేయండి.

9804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS