కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో అల్లరి నరేష్. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన ఈ అల్లరోడికి ఇప్పుడు సక్సెస్ కరువైంది. చివరిగా సునీల్‌తో కలిసి సిల్లీ ఫెల్లోస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా నిరాశపరచింది. ఒక్క హిట్‌తో మళ్లీ గాడిలో పడాలని అల్లరి నరేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకి సీమశాస్త్రి, సీమటపాకాయ్ వంటి మంచి విజయాలని అందించిన జీ. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కిసంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుందని సమాచారం. మరి ఈ చిత్రం అయిన అల్లరి నరేష్‌కి మంచి విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే అల్లరి నరేష్ ప్రస్తుతం మహర్షి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో నరేష్ ఫ్రెండ్ క్యారెక్టర్లో కనువిందు చేయనున్నాడట.