డాక్టరేట్ గౌరవాన్ని దక్కించుకున్న నరేష్

Mon,March 7, 2016 05:23 PM
naresh gets doctorate

ఏదైన రంగంలో అపారమైన కృషి చేసే వారికి ఇచ్చే డాక్టరేట్ అవార్డ్‌ని తాజాగా సీనియర్‌ స్టార్‌ నరేష్‌కు ఇచ్చారు. ఎన్నో ఏళ్ళుగా సినీ పరిశ్రమలో తన దైన సేవలను అందిస్తున్న నరేష్‌కు గౌరవ డాక్టరేట్‌ లభించడం ఆయన అభిమానులను మరింత ఆనందపరుస్తుంది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ నరేష్ కు గౌరవ డాక్టరేట్ ను అందించింది.

డాక్టరేట్‌ పురస్కారం రావడంపై నరేష్‌ మాట్లాడుతూ , ‘తన నటనా రంగంలో ఇప్పటి వరకు 150 సినిమాలు చేసారని, అది గుర్తించిన న్యూయార్క్‌ యూనివర్సిటీ తనకు డాక్టరేట్‌ ప్రకటించింది అని తెలిపారు. అయితే అపూర్వ గౌరవాన్ని తన గురువు జంధ్యాల, విజయ నిర్మల, కృష్ణ కు అంకితమిస్తున్నానని తెలిపారు. బిరుదులు అవార్డుల కోసం తానెన్నడు పాకులాడలేదని, ఈ పురస్కారం లభించడం మరింత సంతోషంగా ఉందని నరేష్‌ అన్నారు. ఒకప్పుడు హీరోగా అలరించిన నరేష్‌ ప్రస్తుతం సపోర్టింగ్‌ క్యారెక్టర్‌లు చేస్తున్నారు . ఈ ఏడాది నేను శైలజ, గరం, గుంటూర్‌ టాకీస్ చిత్రాలలో నటించిన నరేష్‌ శ్రీశ్రీ, బ్రహ్మోత్సవం, అ..ఆ సినిమాలలోను కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.

2331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles